ఆర్టికల్ 370 రద్దుపై కమల్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-08-06 06:34 GMT

కమల్ హాసన్. నిత్యం వివాదాల్లో ఉంటూ ఉంటారు. ఇప్పుడు దేశ ప్రజలంతా (మెజారిటీ) ఆమోదిస్తున్న జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే..కమల్ మాత్రం భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఈ అంశంపై విభిన్న వాదనలు విన్పిస్తున్నా దేశ ప్రజలు ఎక్కువ శాతం మాత్రం మోడీ సర్కారుకే జై అంటున్నారు. ఆర్టికల్ 370తోపాటు 35ఏ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయటం కూడా సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లుగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఆర్టిక‌ల్ 370, 35ఏల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉన్న‌ద‌ని, వాటిలో మార్పులు చేయాల‌నుకుంటే, ముందుగా చ‌ర్చ‌ల ద్వారా ఆ ప్ర‌క్రియ చేప‌ట్టాల‌న్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్‌ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్‌ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన తీర్మానం, బిల్లులను కేంద్రం సోమవారమే రాజ్యసభలో ఆమోదం పొందింది. మంగళవారం నాడు లోక్ సభలో కూడా ఇది ఆమోదం పొందనున్న విషయం తెలిసిందే.

 

Similar News