తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై బిజెపి ఎంపీ అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం.. కమీషన్ల కోసమే ఆరాటపడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతుల ఇబ్బందులు తీర్చే రోజు దగ్గరకు వచ్చిందని, ఆ సమస్య తీర్చిన రోజు టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ నెత్తిన తడిగుడ్డ వేసుకుని కూర్చోవాలంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీ బాధ్యతను టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు చేసే రోజు జీవితంలో రాదని తేల్చిచెప్పారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడుతుందని వెల్లడించారు. అమిత్ షా పర్యటనలో ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయటం లేదని ఆరోపించారు.