ఆర్ బిఐలో కీలక పరిణామం

Update: 2019-06-24 04:37 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) లో కీలక పరిణామం. బ్యాంకు డిప్యూటి గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేశారా అంటూ కొన్ని మీడియా లలో వార్తలు వచ్చాయి.

తనకు ఇంకా ఆరు నెలల పదవీకాలం ఉన్నా ముందుగానే వైదొలిగారు. తిరిగి ఆయన గతంలో పనిచేసిన న్యూయార్క్‌ యూనివర్సిటీ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు అర్థశాస్త్రం ప్రొఫెసర్‌గా చేరతారని చెబుతున్నారు. ఆర్ బిఐ నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని గతంలో ఈయన వ్యాఖ్యానించారు.

Similar News