జగన్ కు ఈటెల లేఖ

Update: 2019-06-15 11:53 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓ లేఖ రాశారు. హుజూరాబాద్ కు చెందిన దొంత రమేష్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం కల్పించాలని కోరారు. రాష్ట్రానికి చెందిన భక్తులకు రమేష్ గత 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని ఈటెల తన లేఖలో పేర్కొన్నారు.

కొత్త బోర్డు ఏర్పాటు సమయంలో సహజంగానే తెలంగాణకు ఒక బోర్డు మెంబర్ ను కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఈటెల ప్రత్యేక ఆహ్వానితుడిగా రమేష్ పేరును సూచించారు. దీనిపై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

 

Similar News