పందాలతో వైసీపీ మైండ్ గేమ్

Update: 2019-05-02 07:46 GMT

ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ పందాలతో మైండ్ గేమ్ ఆడుతోందని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అంతే కాదు..టీడీపీ తరపున గెలిచే ఎమ్యెల్యేలు,ఎంపీలకు అప్పుడే ప్రలోభాలు ప్రారంభించారని ఆరోపించారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించాలని అన్నారు. వైసిపి,బిజెపి ప్రలోభాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. నేరం చేయబోయే ముందు నెపం టిడిపిపై నెట్టడం వైసిపికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గురువారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..‘ హింసా విధ్వంసాల స్కెచ్ లను ముందే వైసిపి నేతలు వేస్తారు. టిడిపి పాల్పడుతోందని దుష్ప్రచారానికి తెగబడతారు. వైసిపియే ఆ నేరాలకు-ఘోరాలకు పాల్పడిందనేది అందరూ చూశారు. కౌంటింగ్ కు ముందుకూడా ఇదేవిధమైన విష ప్రచారం వైసిపి చేస్తోంది.

పోలింగ్ నాడు చేసిన దుర్మార్గాలనే కౌంటింగ్ లోనూ వైసిపి పాల్పడే ప్రమాదం. టిడిపి నేతలు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి. నేరస్థులు ఎప్పుడూ విజయం సాధించలేరు. బుకాయింపులతో అబద్దాన్ని నిజం చేయలేరు. నేరగాళ్లతో పోటీలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి ఘన విజయం తథ్యం. నూటికి 1000% తెలుగుదేశం గెలుపు తథ్యం. ఒకవైపు రాష్ట్రంలో వైసిపి కుట్రలను ఎదుర్కోవాలి. మరోవైపు దేశంలో పార్టీలను ఏకం చేయాలి. ఏపిలో బిజెపి దురాగతాలపై ఇతర రాష్ట్రాలను,పార్టీలను చైతన్యపరచాలి. 50% వీవి ప్యాట్ రశీదుల కోసం న్యాయ పోరాటం. దేశవ్యాప్త పోరాటంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం. రానురాను ఎన్నికల సంఘం బలహీనపడుతోంది.

భారత ప్రజాస్వామ్యానికే బలహీన ఈసి ప్రమాదకరం. వ్యవస్థలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యానికి మరింత బలం. ఓటమి నైరాశ్యంతోనే ప్రధాని మోడి చౌకబారు విమర్శలు. తనను చంపేస్తారని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు. కులాలు,మతాల మధ్య విద్వేషపూరిత ఉపన్యాసాలు. ప్రధాని దుస్తులు ప్రతిపక్షాలు కుట్టించుకున్నట్లు దిగజారుడు ఆరోపణలు. ప్రధాని హోదాను దిగజార్చేలా నరేంద్రమోడి వ్యాఖ్యలు. ఫఓణి తుపాన్ సహాయచర్యలపై ఒడిశాలో సమీక్షలకు అనుమతి. ఆంధ్రప్రదేశ్ లో తుపాన్ సమీక్షలకు అనుమతి ఇవ్వరు. అక్కడా,ఇక్కడా ఒకే తుఫాన్ విధ్వంసంతో ప్రజానీకం ఇబ్బందులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,తూర్పుగోదావరిలో భారీ వర్షాలు,ఈదురుగాలులు.తిత్లి తరహా సహాయ చర్యలకు అడ్డం పడుతున్నారు.’ అని విమర్శించారు.

 

Similar News