జగన్ నివాసం వద్ద భద్రత పెంపు

Update: 2019-05-22 05:55 GMT

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ గురువారం ‘బిగ్ డే’. ఎందుకో అందరికీ తెలిసిందే. అదే సమయంలో జగన్ బుధవారం నాడు తాడేపల్లిలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి వెళ్ళనున్నారు. అక్కడ నుంచే ఆయన ఫలితాలను వీక్షించనున్నారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి తాడేపల్లికి తరలించిన విషయం తెలిసిందే. కౌంటింగ్ నేపద్యంలో జగన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. ఎందుకంటే నాయకుల తాకిడి..కార్యకర్తల హంగామా, ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్ధులు సహజంగా పార్టీ కార్యాలయం, జగన్ నివాసానికి చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

బుధవారం రాత్రి నుంచి జగన్ నివాసం వద్ద ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఏపీఎస్‌పీ)కి చెందిన రెండేసి కంపెనీలు పహరా కాయనున్నాయి. స్థానిక పోలీసులు 50 మంది చొప్పున అదనంగా భద్రత విధుల్లో ఉంటారు. చంద్రబాబు ప్రస్తుతం సీఎంగా ఉన్నందున ఆయన ఆయనకు సహజంగా భద్రత పటిష్టంగా ఉంటుంది. అయినా సరే కార్యకర్తలు..నాయకుల హంగామా ఉండే అవకాశం ఉండటంతో అక్కడ నుంచి అదనపు సిబ్బందిని నియమించారు.

Similar News