మోడీ ప్రమాణ స్వీకారానికి మమత

Update: 2019-05-28 16:35 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన వైఖరి మార్చుకున్నారా?. ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు దూకుడు తగ్గించినట్లు కన్పిస్తోంది. ఈ విమర్శలు కూడా హద్దులు దాటి మరీ సాగాయి. కానీ సడన్ గా మమత ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. సహజంగా అయితే ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీలేదు. కానీ మమతా, మోడీల మధ్య సాగిన మాటల యుద్ధం..తీవ్ర విమర్శల వల్లే ఇది ఆసక్తికర అంశంగా మారింది.

మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అంశం గురించి మమతా మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లానే నాకు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది. ఈ విషయం గురించి ఇతర సీఎంలతో చర్చించాను. దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. ప్రముఖ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నట్లు ప్రకటించారు.

 

Similar News