కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం

Update: 2019-05-30 04:41 GMT

జాతీయ స్థాయిలో ఊహించని రీతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ వైపు రాహుల్ గాంధీ రాజీనామా నిర్ణయం..ఫలించని సీనియర్ల ఒత్తిళ్ళు. ఈ తరుణంలో టీవీల్లో చర్చలకు ఓ నెల రోజులు కాంగ్రెస్ నేతలు ఎవరూ వెళ్ళకూడదని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ మీడియా ఇన్ ఛార్జి రణ్ దీప్ సూర్జేవాలా ఓ ప్రకటన విడుదల చేశారు. తమ నిర్ణయానికి అనుగుణంగా మీడియా ఛానళ్ళు కూడా తమకు సహకరించాలని ఆయన కోరారు.

రాహుల్ తన రాజీనామాను ఉపసంహరించుకుంటారా? లేదా తన మాటకే కట్టబడి ఉంటారా? లేదా ప్రచారం జరుగుతున్నట్లు కొత్తగా ప్రిసీడియం ఏర్పాటు చేస్తారా?. ముఖ్యంగా సీనియర్ నేతల తీరుపట్ల రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ సారి పార్టీను పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కొత్త కాంగ్రెస్ ను చూసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

 

Similar News