ఏపీ రాజకీయాల్లో కలకలం, ప్రకాశం ఎస్పీ బదిలీ

Update: 2019-04-09 15:48 GMT

ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ బదిలీను బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఆయన స్థానంలో సిద్ధార్ధ్ కౌషల్ ని ప్రకాశం ఎస్పీగా నియమిస్తూ ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. చివరి నిమిషంలో కూడా పోలీసు అధికారుల బదిలీ ఒక రకంగా టీడీపీ శ్రేణులను షాక్ కు గురిచేస్తోంది. ప్రకాశం ఎస్పీతో పాటు మంగళగిరి సీఐపై కూడా బదిలీ వేటు పడింది. ఈ నియోజకవర్గం నుంచి సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. తాడేపల్లి సీఐ వై శ్రీనివాస్ పై బదిలీ వేటు వేసి ఆ స్థానంలో సురేష్ కుమార్ ను నూతన సీఐ గా నియామించారు. ఓ వైపు అధికార తెలుగుదేశం పార్టీ నేరుగా సీఈసీపైనే విమర్శలు గుప్పిస్తోంది. సీఈసీ పూర్తిగా ప్రధాని మోడీ చేతిలోకి వెళ్లిపోయిందని..వాళ్ళు ఏమి చెపితే అదే చేస్తున్నారని ఆరోపిస్తోంది. వైసీపీ ఫిర్యాదులు చేయటం..ఆ వెంటనే ఎన్నికల కమిషన్ నిర్ణయాలు వస్తున్నాయని టీడీపీ విమర్శిస్తోంది.

 

 

Similar News