చంద్రబాబుకు కెసీఆర్ కు ఝలక్

Update: 2019-04-08 16:13 GMT

చెవిలో కాదు..మైక్ లో చెబుతున్నా

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ వికారాబాద్ ఎన్నికల సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని ఇంత కాలంగా కెసీఆర్ తో బహిరంగంగా చెప్పించండి చూస్తాం అన్న అధికార టీడీపీ, జనసేనలకు కెసీఆర్ ఝలక్ ఇచ్చారు. వికారాబాద్ సభలో కెసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాట్లలోనే..‘అసలు సంగతి ఏంటి అంటే చంద్రబాబు డిపాజిట్ రాకుండా ఓడిపోతున్నాడు.ఆయన పరిస్థితి బాగాలేదు. ఖతం అయిపోయింది కహాని. నా దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్టు కూడా ఉంది. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు అంటే..అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక హోదాకు కెసీఆర్ మద్దతు ఇస్తాడు అంటే..నీకు కెసీఆర్ చెవిలో చెప్పాడా? అని ప్రశ్నిస్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ కానీ మా మేలు మేం కోరకుంటాం. ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతున్నాం.

చంద్రబాబునాయుడూ..లక్షలాది మంది ప్రజలు ఉన్న సభ నుంచి..తెలంగాణ గడ్డ మీద నుంచి నేను చెబుతున్నా..చెవులో చెప్పే బాధ్యత మాకు లేదు. చీకటి పనులు నీలాగా చేయం. మందికి గోతులు తీసే పనులు మాకు రావు. ఆ కుట్రలు మాకు రావు తెలంగాణకు. మేం బాగుండాలి. ఇతరులు కూడా బతకాలని మేం కోరతాం. రెండు విషయాలు నేను కుండబద్దలు కొడుతున్నట్లు చెబుతున్నా.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మా ఎంపీ కేశవరావు అనేకసార్లు రాజ్యసభలో మాట్లాడారు. మా ఎంపీలు లోక్ సభలో కూడ మాట్లాడారు. నేను కూడా చెప్పాను. మేం అదే స్టాండ్ పై ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు మాకు 16 ఎంపీ సీట్లు వస్తాయి. ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంటుంది. అక్కడ జగన్మోహణ్ రెడ్డి కూడా బ్రహ్మండగా గెలుస్తున్నాడు. ఇద్దరం కలసి 35, 36 ఎంపీలు దక్కించుకోబోతున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవటానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు.

టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగా నేను మనవి చేస్తున్నా. మేం పక్కోళ్ళు బాగుండాలని కోరతాం కానీ. మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేం కోరం.నీలాంటి దరిద్రం బుద్ది మాకు లేదు. నీలాంటి అల్పులం మేం కాదు. మేం బతకాలి. ఇతరులు కూడా బతకాలి అని కోరతాం మేం. ఇంకో మాట చెబుతున్నా. నీకు లేదు తెలివి. నాకున్నది తెలివి. నాకు లెక్కలు తెలుసు. మాకు ఉదారస్వభావం ఉంది. గోదావరిలో మాకు 1000 టీఎంసీల కేటాయింపు ఉంది. బాజాప్తా అది తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ కు చెప్పినం. పోలవరం కట్టుకోమన్నాం. మేం వద్దనం. తెలంగాణను ముంచుతామంటే వద్దన్నం కాని. పోలవరానికి మేం వ్యతిరేకం కాదు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేం సంపూర్ణ సహకారం చేస్తాం. ఎందుకంటే నీళ్ళు వేస్ట్ గా పోతున్నాయి. ఈ సంవత్సరం కూడా 2600 టీఎంసీలు నీరు సముద్రం పాలు అయ్యాయి. సముద్రానికి పోయినదానికంటే ఏపీ వాళ్లు వాడుకుంటే మాకు ఏమైనా అబ్జెన్షన్ ఉంటదా?. ఉండదు. మేం కోరేది అల్లా మా వాటా మాకు రావాలి. మా పొలాలు పారాలి. మాతోపాటు మీరూ కూడా బతకాలి అని కోరుకుంటాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడే రకం కాదు. తెలంగాణ గుణమే మేం తినాలి ఇతరులు కూడా బతకాలి అని ఆలోచిస్తారు. మేం మీలాగా స్వార్ధపరులం కాదు. ఆంధ్రా ప్రజలు కూడా మంచోళ్ళే. నీలాంటి పది మంది కిరికిరిగాళ్లు ఉన్నరు అక్కడక్కడ తప్ప. ఆంధ్రా ప్రజలతో మాకు పంచాయతీలేదని మనవి చేస్తున్నా.’ అని వ్యాఖ్యానించారు.

Similar News