టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి

Update: 2019-04-01 12:14 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు అందరూ జంపింగ్ లు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫిరాయింపులే ఆ పార్టీని కలవరానికి గురిచేస్తుంటే..సీనియర్ నేతలు కూడా వరస పెట్టి పార్టీని వీడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావ్ సమక్షంలో సునీతా లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు.

సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసే వాళ్లను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడారిగా ఉన్న నర్సాపూర్‌కు సాగునీరు కావాలని ఇన్ని రోజులుగా బద్ధ శత్రువులుగా ఉన్న మేం టీఆర్ఎస్‌లో చేరానన్నారు. కార్యకర్తలకు ఎటువంటి అనుమానాలొద్దని సునీత వ్యాఖ్యానించారు. సునీతా లక్ష్మారెడ్డికి పార్టీలో సుముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తెలిపారు. మెదక్‌లో భారీ మెజార్టీ ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాబోయే రెండేళ్లలో కోటి ఎకరాలు మాగాణి అవ్వటం ఖాయమన్నారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీకి పట్టుమని 10 సీట్లు కూడా రావన్నారు. మన మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం రాదని కేటీఆర్ తెలిపారు.

 

 

Similar News