వివేకా హత్య కేసులో కీలక పరిణామం

Update: 2019-03-28 10:34 GMT

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి గురువారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేసినందుకు ముద్దాయిలు యెర్ర గంగిరెడ్డి, పీఏ యం వి క్రిష్ణారెడ్డి, ప్రకాష్ లను గురువారం ఉదయం పది గంటలకు పులివెందుల డిఎస్పీ అరెస్టు చేశారు. వివేకా హత్య జరిగిన తర్వాత వీరు ఆయన భౌతిక కాయాన్ని పడకగదికి తరలించడం, లేఖను సాయంత్రం వరకు ఇవ్వకుండా ఉండడం వంటి కారణాలతో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 15న ఉదయం 5.30 గంటలకు వివేకా ఇంట్లోకి వెళ్లిన కృష్ణారెడ్డి వివేకా మృతదేహాన్ని చూసినట్టు చెప్పిన నేపద్యంలో ఈ అరెస్టులు జరిగినట్లు తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టులో ప్రవేశపెట్టారు. మరో వైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సిబిఐకి అప్పగించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గంగిరెడ్డి వైఎస్ వివేకాకు సన్నిహితుడుగా చెబుతున్నారు.

 

Similar News