చంద్రబాబుపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

Update: 2019-03-30 12:59 GMT

‘ఫినిష్. చంద్రబాబు పార్టీ ఫినిష్. ఆయన కథ ముగిసింది’. ఇవీ ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు చేసిన సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు దొంగ. ఆయనకు నీతి, నియమాలు లేవు. చంద్రబాబునాయుడిది కుటుంబ పాలన. వైఎస్ జగన్ ది సొంత పార్టీ అయితే..నీది ఎన్టీఆర్ దగ్గర నుంచి లాక్కున్న పార్టీ టీడీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడికి అసలు క్యారెక్టర్ ఉందా?. ఎన్టీఆర్ ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా పార్టీ పెట్టారో..అలాంటి విరోధి అయిన కాంగ్రెస్ తో చంద్రబాబు ఇఫ్పుడు పొత్తు పెట్టుకున్నారు. కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. మోహన్ బాబు విజయవాడలో శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడి మాటలు నమ్మిన వాడు ఎవడైనా నట్టేట మునిగినట్లే. మోడీ ఏపీకి వస్తే బేడీలు వేస్తాననన్నాడు. మళ్ళీ అదే మోడీతో చేతులు కలిపాడు. చంద్రబాబు ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దగ్గర తాకట్టుపెట్టాడు. ఓటుకు నోటు కేసులో దొరికి పారిపోయాడు. పసుపు-కుంకుమ డబ్బులు ప్రజలదే. ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తున్నాడు. చంద్రబాబు అహంకారం వదిలిపెట్టాలి.

మాట్లాడితే నేను...నేను అనే పద్దతి మానుకోవాలి. చంద్రబాబు వల్ల రాష్ట్రం మునిగిపోతుంది. జగన్ మోహన్ రెడ్డికి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. అనుభవం లేకపోయినా తనకు సినిమాల్లో ఎన్టీఆర్ వంటి మహానటుడు పక్కన ఛాన్స్ ఇచ్చారన్నారు. జగన్ కూడా అవకాశం ఇస్తే నిరూపించుకుంటాడన్నారు. స్కూల్ లో చేరగానే అన్ని పాఠాలు వస్తాయా? రోజుకు కొంత నేర్చుకుంటాడు. అలాగే జగన్ పరిపాలన చేస్తాడు. ‘దొరికే వాడు దొంగ. దొరకని వాడు దొర’. నువ్వు దొరకలా. అంతే తేడా. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు అమాయకులని.. వారిని బాబు మోసం చేశారని మోహన్ బాబు ఆరోపించారు. చంద్రబాబు కంటే ముందే తాను టీడీపీలో ఉన్నానని.. ఆయన పునాది కాంగ్రెస్ మోహన్‌బాబు ఎద్దేవా చేశారు. అప్పట్లో ఎన్టీఆర్‌పైనే చంద్రబాబు పోటీ చేస్తానన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు కోసం టీడీపీలో ఎవరూ పనిచేయడం లేదని.. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు.

 

Similar News