తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్. ఆ పార్టీ సీనియర్ నేత, ఎస్సీ సెల్ ఛైర్మన్ ఆరేపల్లి మోహన్ కు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి..కారెక్కారు. రెండు రోజుల కిందటే టీఆర్‌ఎస్ స్థానిక నేతలతో చర్చించిన మోహన్.. ఆదివారం కేటీఆర్‌తో సమావేశమై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. లోక్ సభ ముందు సీనియర్ నేత పార్టీని వీడడం.. కాంగ్రెస్ శ్రేణులను షాక్ కు గురిచేసింది. ఎస్సీ రిజర్వ్ స్థానమైన మానకొండూర్ నుంచి 2009లో అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన రెండుసార్లు ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతిలో ఓటమి చెందారు.