అపొజిషన్ దగ్గర డబ్బులుంటాయండీ!

Update: 2019-03-27 08:16 GMT

ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసిన ప్రశ్న. కర్నూలులో మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు ఈ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం దగ్గర డబ్బులుండవని ఎన్నికల కమిషన్ కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఉంటే గింటే డబ్బులు అధికార పార్టీ అయిన మా దగ్గర ఉండాలి కానీ..ప్రతిపక్షం దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి అన్నట్లు ఉంది చంద్రబాబు మాట్లాడిన తీరు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయండి ఫ్రీగా. అన్నీ డబ్బులు పంపిస్తున్నారు. విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. వీళ్లకు ఐడియా ఉండాలిగా ఎలక్షన్ కమిషన్ కు. అపొజిషన్ కు డబ్బులు ఎక్కడ ఉంటాయండీ?.ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వస్తాయండీ.దీనికి ఆన్సర్ చేయాలిగా ఎలక్షన్ కమిషన్ కూడా.

ఏకపక్షంగా ఎన్నికలు కండక్ట్ చేయటం సరికాదు. భయబ్రాంతులను చేసి ఎన్నికలు పెట్టాలంటే కరెక్ట్ కాదు. భయబ్రాంతులకు గురిచేస్తామనటం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలను రక్షించాలి. ఎన్నికల కమిషన్ పై కూడా దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తాం. ఓ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న మేం రోడ్డు మీదకు రావాలాండీ? మామూలుగా అయితే అధికారపక్షంపై ఆరోపణలు ఉంటాయి. ప్రతిపక్షం ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో స్పందిస్తారు. మేం ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు. ఇది మంచి పద్దతి కాదు. దీనిపై ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్య వాదులందరికీ విజ్ణప్తి చేస్తున్నాం. పేదలు కూడా ఈ విషయాలను అర్ధం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.

 

 

Similar News