ఎంపీలను ఓడిస్తేనే సచివాలయానికి కెసీఆర్

Update: 2019-03-30 10:04 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ పై బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడిస్తేనే ఆయన సచివాలయానికి వచ్చి పరిపాలన చేస్తారని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సారు కారు పదహారు కాదు..,బారు బీరు సర్కారు అన్న విధంగా ఉంది ఈ పాలన అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కు శుక్రవారం నాటి మోడీ సభతో కేసీఆర్ కు వణుకుపుట్టిస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మోడీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అహంకారం తో అధికార మదం తో విర్రవేగే నాయకులకు నిన్నటి ఎల్బీస్టేడియం సభ అట్టర్ ప్లాప్ షో గుర్తుంచుకోవాలని..నోటి దురుసు,ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జనం చీదరించుకుంటున్నారన్నారు.

మిర్యాలగూడ సభలో కూడా కెసీఆర్ అవాకులు చెవాకులు పేలారు...ముగ్గురు ఎమ్మెల్సీ లు ఓడిపోగానే కేసీఆర్ కు భయం పట్టుకుంది.తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటున్న ఈకుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని విముక్తులను చేయండి. మంత్రివర్గం లో ఒక్క మహిళ మంత్రి,గిరిజన మంత్రి కూడా లేరు...రెండు యాగాలు చేసిన మీరు హిందువా...ఏ విధంగా హిందువో నువ్వు చెప్పాలి...అయోధ్య రామ మందిరం పై నీ వైఖరి చెప్పాలి కేసీఆర్ వక్రబుద్దితో నువ్వు చేసే యజ్ఞం.., యజ్ఞం కాదు..నువ్వు హిందువు కాదు.., అసదుద్దీన్ ఒవైసీ కంటే మించిన ముస్లిం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.

 

Similar News