వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సాక్ష్యాత్తూ ఏపీ డీజీపీ ఠాకూర్ కారులోనే అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు 35 కోట్ల రూపాయల నగదు తరలించారని వ్యాఖ్యానించారు. డీజీపీగా ఠాకూర్ ఉంటే ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా..సాఫీగా సాగవని ఆయన్ను అక్కడ నుంచి బదిలీ చేయాల్సిందేనని అన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇచ్చిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. డీజీపీ డబ్బు తరలింపు వాటికి నేరుగా ఆదారాలు ఉండవని, డిజిపి వాహనం తనిఖీ చేసే దైర్యం పోలీసులకు ఉంటుందా అని ఆయన అన్నారు.
ఎన్నికల సంఘం మాత్రమే చేయగలుగుతుందని ఆయన అన్నారు. శ్రీకాకుళం ఎస్పిగా ఉన్న అదికారి ఐదు కోట్ల మొత్తం పట్టుబడితే వదలివేశాడని తాము ఆరోపించామని, ఆయన తనపై కేసు పెట్టారని, ఇప్పుడు ఠాకూర్ కూడా తనపై కేసు పెట్టుకోవచ్చని విఇజయసాయిరెడ్డి సవాల్ చేశారు.ఇంటెలెజెన్స్ డిజి ని తొలగించకుండా చంద్రబాబు జిఓ ఇవ్వడం సరికాదని, దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తుందని, కోర్టులో ఈ వ్యవహారం తేలుతుందని అనుకుంటున్నామని ఆయన అన్నారు.