తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ పై జనసమితి అధినేత కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కెసీఆర్ కు ఓటువేసినా ఫాం హౌస్ లోనే ఉంటారని..వేయకపోయినా అక్కడే ఉంటారని పెద్ద తేడా ఏమీలేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బురద గుంటలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు. గడువు కంటే తొమ్మిది నెలల ముందే ఈ నిరంకుశ పాలన పోతున్నందుకు సంతోషించాలని వ్యాఖ్యానించారు. తమకు టీఆర్ఎస్ లా ఇవ్వటానికి డబ్బులు లేవు. డబ్బులతో ప్రజలను కొనలేరు. మీ కోసం నిలబడతాం..మీ కోసం పనిచేస్తాం.
మా గత చరిత్రే దీనికి సాక్ష్యం. స్పష్టంగా అదే లక్ష్యంతో పనిచేస్తామని కోదండరాం వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని... తాగబెడుతున్నారని కోదండరాం ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు వస్తాయని అని చెప్పి కేవలం 25 వేల నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ రోజు పర్వదినం..మన గెలుపునకు సంకేతం. అనుమానమే లేదు. ఆయన ఫాం హౌస్ కు వెళుతున్నారని కోదండరాం వ్యాఖ్యానించారు. మేడ్చల్ బహిరంగ సభలో కోదండరాం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.