Telugu Gateway
Latest News

ప్రపంచంలోని అతి పెద్ద టన్నెల్ ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోని అతి పెద్ద టన్నెల్ ఎక్కడో తెలుసా?
X

ఒకప్పుడు ఆరు నెలలు ఆ రూట్ బంద్ అయ్యేది. ఎందుకంటే భారీ మంచు వర్షంతో వాహనాలకు ఏమీ కన్పించేది కాదు. ఇప్పుడు ఇక ఆ తిప్పలు ఉండవు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద హైవే టన్నెల్ శనివారం నుంచి అందుబాటులోకిరానుంది. 9.02 కిలోమీటర్ల నిడివి గల అటల్ టన్నెల్ ను శనివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తంగ్ వద్ద ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ టన్నెల్ మనాలి, లేహ్ ల మధ్య దూరాన్ని 46 కిలోమీటర్లు తగ్గించనుంది. దీంతో ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.

ఈ హైవే టన్నెల్ సముద్ర ఉపరితలం కంటే పది వేల అడుగులపైన ఉంటుంది. అత్యాధునిక ప్రమాణాలతో ఈ టన్నెల్ ను నిర్మించారు. ఈ టన్నెల్ ద్వారా ప్రతి రోజూ 3000 కార్లు, 1500 ట్రక్స్ 80 కెఎంపీహెచ్ స్పీడ్ తో వెళ్ళేలా డిజైన్ చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో రోహ్ తంగ్ పాస్ వద్ద ఈ వ్యూహాత్మక టన్నెల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న దీనికి శంకుస్థాపన చేశారు. 2019 డిసెంబర్ లో మోడీ ప్రభుత్వం ఈ టన్నెల్ కు దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి పేరు పెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే దీనికి అటల్ టన్నెల్ అని నామకరణం చేశారు.

Next Story
Share it