Telugu Gateway
Latest News

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
X

గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా నమోదు అవుతున్న కరోనా కేసులను చూస్తుంటే భారత్ లో ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తోంది. గత నెలతో పోలిస్తే అక్టోబర్ లో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టినట్లే కన్పిస్తోంది. గడచిన 24 గంటలలో 10,89,403 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 61,267 పాజిటివ్ కేసులు, 884 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. ఇటీవల వరకూ పెద్ద ఎత్తున కేసులు నమోదు అయిన ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా ఉధృతి తగ్గినట్లే కన్పిస్తోంది.

దేశంలో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,083గా ఉంది. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,19,023గా ఉండగా.. కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 56,62,491కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 1,03,569 మంది మృతి చెందారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 84.70 శాతంగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 13.75గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,10,71,797 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో సహజంగానే దేశంలో కేసుల సంఖ్య తగ్గుతోంది.

Next Story
Share it