Telugu Gateway
Latest News

నిరుద్యోగం వల్లే రేప్ లు పెరుగుతున్నాయ్

నిరుద్యోగం వల్లే రేప్ లు పెరుగుతున్నాయ్
X

ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి. కానీ నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఆయన మాటలు ఎప్పుడూ దుమారం రేపుతూనే ఉంటాయి. కానీ ఆయన ఏ మాత్రం వెనక్కితగ్గరు. కొద్ది రోజుల క్రితమే మంచి అమ్మాయిలు చాలా తొందరగానే నిద్రపోతారు అని వ్యాఖ్యానించి దుమారం రేపారు. అమ్మాయిలు అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉండాల్సిన అవసరం ఏముందనే తరహాలో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణం అయ్యాయి. తాజాగా ఆయన మరోసారి దేశంలో రేప్ లు పెరగటానికి కారణం నిరుద్యోగమే అని పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం కూడా రేప్ ల కు ఓ కారణంగా మారిందని వ్యాఖ్యానించారు.

సంప్రదాయ భారతీయ సమాజంలో సెక్స్ పెళ్లి తర్వాతే ఉంటుందని అన్నారు. నిరుద్యోగం కారణంగా చాలా మందికి పెళ్లిళ్లు కూడా కావటంలేదని తెలిపారు. తానేమీ రేప్ లను సమర్ధించటం లేదని..వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. సెక్స్ అనేది మనిషి సహజమైన కోరిక అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ లో జరిగిన దారుణమైన రేప్ అంశం దుమారం రేపుతున్న తరుణంలో మార్కండేయ ఖట్జూ ఈ వ్యాఖ్యలు చేయటం దుమారం రేపుతోంది. మనుషులకు ఆహారం తర్వాత కోరిక సెక్సే అని పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన తన అభిప్రాయాలు వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Next Story
Share it