Telugu Gateway
Latest News

రిలయన్స్ రిటైల్ లోకి లక్ష కోట్లు వస్తాయా?

రిలయన్స్ రిటైల్ లోకి లక్ష కోట్లు వస్తాయా?
X

రిలయన్స్ దూకుడు చూస్తుంటే ఇదే అనుమానం రాక మానదు. జియో ఫ్లాట్ ఫామ్స్ లోకి అంతే..అలా వరస పెట్టి పెట్టుబడులు వచ్చిపడ్డాయి. ఇప్పుడు అదే బాటలో రిలయన్స్ రిటైల్ విభాగం నడుస్తోంది. చూస్తుంటే రిటైల్ విభాగంలోకి కూడా రిలయన్స్ ఇండస్డ్రీస్ లక్ష కోట్ల రూపాయలు సమీకరిస్తుందనే అంచనాలు వెలువుడుతున్నాయి. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీఐసీ, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ లు రిలయన్స్ రిటైల్ లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. జీఐసీ రూ .5,512.5 కోట్లు, టీపీజీ 1,837.5 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఆర్‌ఆర్‌విఎల్‌లో వరుసగా 1.22 శాతం, 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి. తాజా పెట్టుబడులతో పాటురిలయన్స్ రిటైల్ ఇప్పటివరకూ 7.28 శాతం వాటాల విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల పెట్టుబడులను సాధించింది. తొలుత రిలయన్స్ రిటైల్ లో సిల్వర్‌ లేక్‌ ఆ తర్వాత కేకేఆర్‌, జనరల్‌ అట్లాంటిక్‌, ముబదాల కూడా పెట్టుబడులు పెట్టాయి.

మూడు వారాల్లో ఆరు డీల్స్ జరిగాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ 0.84 శాతం వాటాకుగాను 3,675 కోట్ల రూపాయలు, సిల్వర్ లేక్ పార్ట్‌ నర్స్ 1,875 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆర్‌ఆర్‌విఎల్‌ 3.38 బిలియన్ల డాలర్లతో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంది. రిలయన్స్ రిటైల్ ఇండియాలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయక సంస్థ. 12,000 స్టోర్లతో, 64 కోట్ల వినియోగదారులతో భారతదేశపు అతిపెద్ద రీటైలర్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో మరిన్ని డీల్స్ ఉండే అవకాశం ఉందని..ఈ మొత్తం లక్ష కోట్ల రూపాయలకు చేరటం ఖాయం అని చెబుతున్నారు.

Next Story
Share it