Telugu Gateway
Latest News

తల్లి భారతికి మీ సేవలు నిరుపమానం

తల్లి భారతికి మీ సేవలు నిరుపమానం
X

భారత వాయుసేన వార్షికోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రదర్శనలు నిర్వహించారు. కోవిడ్ కారణంగా ప్రతి ఏటా నిర్వహించే స్థాయిలో కాకుండా ఒకింత పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం నాడు 88వ వార్షికోత్సవాలు జరుపుకుంది. ఈ సారి ఉత్సవాల్లో కొత్తగా వచ్చిన రాఫెల్ జెట్ విమానాలను ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీ సమీపంలోని హిండన్ స్టేషన్ లో భారీ పరేడ్ తోపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ సాహోసేపేతమైన యుద్ధవీరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆకాశాన్ని..దేశాన్ని సురక్షితంగా ఉంచటమే కాదు...విపత్తుల సమయంలో మానవాళికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశేషమైన సేవలు అందిస్తోందని మోడీ కొనియాడారు. తల్లి భారతికి మీరు అందిస్తున్న సేవలు ప్రతి ఒక్కరిని ఉత్తేజితులను చేస్తాయని పేర్కొన్నారు. 1932 సంవత్సరం అక్టోబర్ 8న భారతీయ వాయు సేన ఏర్పాటు అయింది. అందుకే ప్రతి ఏటా ఈ రోజు వాయు సేన దినోత్సవం నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఈ సారి ఉత్సవాలకు సామాన్య ప్రజలను అనుమతించలేదు. భారతీయ వాయుసేనలో ఉన్న శక్తివంతమైన అన్ని విమానాలను ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచారు.

https://www.youtube.com/watch?v=ujAj9EJCPjM

Next Story
Share it