Telugu Gateway
Latest News

ట్రంప్ కు కరోనా..కుప్పకూలిన గ్లోబల్ మార్కెట్స్

ట్రంప్ కు కరోనా..కుప్పకూలిన గ్లోబల్ మార్కెట్స్
X

స్టాక్ మార్కెట్ల స్పందనకు సంబంధించి ఎన్నో జోక్స్ ఉన్నాయి. అమెరికాకు జలుబు చేస్తే భారత మార్కెట్లు తుమ్ముతాయన్న తరహాలో సరదాగా ఎన్నో జోక్ లు వేస్తుంటారు. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలవుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కు కరోనా వచ్చిందనే వార్తలు రావటంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. ఆసియన్ స్టాక్స్, ఆయిల్ ధరలతోపాటు ఈక్విటీ ఫ్యూచర్స్ భారీగా పతనం అయ్యాయి.

జపాన్ మార్కెట్ సూచీ నిక్కీ 255 మేర నష్టపోయింది. బ్రెంట్ క్రూడ్ కూడా 3.5 శాతం మేర క్షీణించింది.యూరప్ లోని ప్రతి ప్రధాన మార్కెట్ కూడా నేలచూపులే చూసింది. సహజంగా అమెరికా మార్కెట్లు ట్రంప్ నకు అనుకూలంగానే ఉంటాయి. అందుకే అంతగా రియాక్ట్ అయ్యాయని చెబుతున్నారు. ట్రంప్ నకు కరోనా రావటంతో ఎన్నికల ప్రచార విధానం మారబోతుందని..అందుకే కొంత అనిశ్చితి ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story
Share it