Telugu Gateway
Latest News

అక్కడ గంటకు 1830 రూపాయల వేతనం

అక్కడ గంటకు 1830 రూపాయల వేతనం
X

ప్రపంచంలోనే అత్యధిక వేతనం చెల్లించేది అక్కడే. ఎందుకంటే అక్కడ గంటకు ఏకంగా 1830 రూపాయలు వేతనం పొందనున్నారు. అంతే కాదు..ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతంగా ఉంది. అదే స్విట్జర్లాండ్ లోని జెనీవా సిటీ. తాజాగా అక్కడ కనీస వేతనం గంటకు 1803 రూపాయలు (23 స్విస్ ఫ్రాంక్ లు)గా నిర్ణయించారు. అంతే కాదు వారంలో కనీసం పని 41 గంటలు కల్పించాల్సి ఉంటుంది. ఈ లెక్కన నెలకు 3.25 లక్షల రూపాయల వేతనం (4086 ఫ్రాంక్స్) లభిస్తుంది. 58 శాతంమంది జెనీవా ఓటర్లు ఈ వేతనాల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

ఒక్క స్విస్ ప్రాంక్ విలువ భారతీయ కరెన్సీతో పోలిస్తే 79.63 రూపాయలు ఉంటుంది. కరోనా కారణంతో చాలా మంది ప్రజలు జెనీవాలో నివసించలేని పరిస్థితులు నెలకొన్నాయి. పేదరికంలోకి జారిపోకుండా ఉండాలంటే జెనీవాలో ప్రజలకు కనీసం 4000 స్విస్ ఫ్రాంక్ లు అవసరం అవుతాయని అంచనా వేశారు. జెనీవాలోని జీవన వ్యయం అధికంగా ఉండటంపై అక్కడి యూనియన్లు. వామఫక్ష రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story
Share it