ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ ‘ సేల్ వచ్చేసింది
![ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ ‘ సేల్ వచ్చేసింది ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ ‘ సేల్ వచ్చేసింది](http://telugugatewaysite.vocalwire.com/wp-content/uploads/2020/10/flipkart-big-billion-day-2020-e1601724043569.png)
పండగ సందడి మొదలైంది. ఈ కామర్స్ సంస్థలు మరోసారి భారీ సేల్ కు రెడీ అయ్యాయి. అందులో భాగంగా తొలుత ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట సేల్ ప్రకటించింది. ఇది అక్టోబర్ 16 నుంచి 21 వరకూ కొనసాగనుంది. ఆరు రోజులు పాటు సాగే ఈ సేల్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ ఒక రోజు ముందుగానే సెప్టెంబర్ 15 నుంచే సేల్ లో పాల్గొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. బిగ్ బిలియన్ డేస్ ద్వారా డెబ్బయి వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందన కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ప్రమోషన్ల కోసం ఫ్లిప్ కార్ట్ తెలుగులో ప్రముఖ హీరో మహేష్ బాబుతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే అమితాబచ్చన్, విరాట్ కొహ్లి, అలియా భట్, రణ్ బీర్ కపూర్, సుదీప్ కిచ్చా తదితరులు బ్రాండ్ అంబాసిడర్లు గా వ్యవహరిస్తున్నారు. మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా త్వరలోనే తన సేల్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సేల్ ద్వారా మొబైల్ ఫోన్లు టీవీలు, గృహోపకరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లు అందిస్తోంది.