సీబీఐ మాజీ డైరక్టర్ ఆత్మహత్య
BY Telugu Gateway7 Oct 2020 4:11 PM GMT

X
Telugu Gateway7 Oct 2020 4:11 PM GMT
షాకింగ్. సీబీఐ మాజీ డైరక్టర్ అశ్వనీ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. సిమ్లాలోని తన నివాసంలో అశ్వనీ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అశ్వనీకుమార్ మరణాన్ని సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా ధృవీకరించారు.
అశ్వనీకుమార్ నాగాల్యాండ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. అశ్వనీకుమార్ 2006 నుంచి 2008 వరకు హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. అనంతరం 2008 ఆగస్ట్ నుంచి 2010 నవంబర్ వరకు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. 2013-2014 మధ్య కాలంలో నాగాలాండ్ కు గవర్నర్ గా పనిచేశారు.
Next Story