Telugu Gateway
Latest News

వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన డబ్ల్లూహెచ్ వో

వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన డబ్ల్లూహెచ్ వో
X

ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరాంతం నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని డబ్ల్యూహెచ్ వో డైరక్టర్ జనరల్ ట్రెడోస్ అథనోమ్ వెల్లడించారు. డబ్ల్యూహెచ్ వో ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పలు వ్యాక్సిన్ లు, ఇతర ఉత్పత్తుల తయారీ దశలో ఉన్నాయని..ఇప్పుడు కావాల్సిందిగా వాటిని ప్రజలకు ఎలా చేరవేయాలనే అంశంపై రాజకీయ సంకల్పం ముఖ్యం అని వ్యాఖ్యానించారు.

ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తక్షణమే వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం తొమ్మిది వ్యాక్సిన్లు ప్రయోగాల దశలో ఉన్నాయన్నారు. డబ్ల్యూహెచ్ వో కు చెందిన కోవాక్స్ అంతర్జాతీయ వ్యాక్సిన్ కేంద్రం 2021 సంవత్సరాంతం నాటికి రెండు వందల కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండు రోజుల పాటు జరిగిన బోర్డు సమావేశంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

Next Story
Share it