Telugu Gateway
Latest News

వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ కల కష్టమే!

వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ కల కష్టమే!
X

ఫ్రపంచం అంతా కరోనా వ్యాక్సిన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ ను సిద్ధం చేయించి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. కరోనాను నియంత్రించటంలో విఫలమయ్యారనే అంశంపై అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇదే ఆయన కొంప ముంచబోతుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ఎన్నికలకు ముందు వ్యాక్సిన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్ కు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే కన్పిస్తోంది. ఎక్కువ మంది నిపుణులు చెబుతున్న మాట ఒకటే. కరోనా వ్యాక్సిన్ ఈ డిసెంబర్ నాటికి లేదంటే కొత్త సంవత్సరంలోనే అని చెబుతున్నారు. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తాజాగా చేసిన ప్రకటన ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఈ వ్యాక్సిన్ పరీక్షలు తుది దశలో ఉన్నప్పటికీ నవంబర్ 25 కంటే ముందు అత్యవసర వినియోగం కోసం ఎలాంటి అనుమతులు తీసుకోబోమని కంపెనీ సీఈవో స్టీఫెన్ బాన్సెల్ వెల్లడించారు. ప్రస్తుతం తాము ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని నిర్ధారించే పనిలో ఉన్నామన్నారు.

ఖచ్చితంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత..వ్యాక్సిన్ సురక్షిత తేలిన తర్వాతే తాము ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిస్ట్రేషన్ (ఎప్ డీఏ)కు సమాచారాన్ని తెలియజేస్తామన్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావటానికి నవంబర్ చివరి వారం వరకూ పడుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తుది దశకు చేరుకున్న వ్యాక్సిన్లలో మోడెర్నా వ్యాక్సిన్ ఒకటి. వృద్ధులపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలను సాధించింది. దీంతో పాటు ఫైజర్, ఆక్స్ ఫర్డ్ యూనిర్శిటీ, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ లు కీలక దశలో ఉన్నాయి. రష్యా మాత్రం రెండవ దశ ప్రయోగాలు పూర్తయిన వెంటనే దేశంలో పౌరులకు వ్యాక్సిన్ అందిస్తూ ముందుకు సాగుతోంది. మరో వైపు మూడవ దశ ప్రయోగాలను కొనసాగిస్తోంది. వ్యాక్సిన్ కంపెనీలు అన్నీ కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పూర్తి ప్రయోగాలు..పరిశీలనలు నిర్ధారణ అయిన తర్వాతే తుది ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించాయి. ఇందులో పలు కంపెనీలు భాగస్వాములు అయ్యాయి.

Next Story
Share it