Telugu Gateway
Latest News

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసింది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసింది
X

ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ సేల్ ను ప్రకటించింది. ఇప్పుడు అమెజాన్ వంతు వచ్చింది. అక్టోబర్ 17 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. పండగల సీజన్ సందర్భంగా ప్రతి ఏటా ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు పోటాపోటీగా కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లు అందించటం ఆనవాయితీ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి కరోనా ప్రభావం కారణంగా అమ్మకాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తకరంగా మారనుంది. వాస్తవానికి కరోనా సమయంలో చాలాచోట్ల ప్రజలు ఆన్ లైన్ లో కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఆన్ లైన్ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను కూడా నియమించుకుంటున్నాయి. హెచ్ డీఎఫ్ సీ కార్డు హోల్డర్లకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ప్రత్యేక డిస్కౌంట్లు అందజేస్తున్నారు.

ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వారు 24 గంటల ముందు నుంచే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో పాల్గొని కొనుగోళ్లు జరపవచ్చు. ఈ సేల్ లో ప్రధానంగా మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు, దుస్తులు, పిల్లల బొమ్మలపై కూడా రాయితీలు ప్రకటించారు. అంతే కాకుండా ఈ నెల 14న విడుదల కానున్న వన్ ప్లస్ 8టీ 5 జీ ఫోన్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లు కూడా గ్రేట్ ఇండియన్ సేల్ లో ఉండబోతున్నాయి. అమెజాన్ యాప్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు అంటే గోల్డెన్ అవర్స్ పై చేసే కొనుగోళ్ళపై కొన్ని వస్తువులకు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నారు.

Next Story
Share it