Telugu Gateway
Latest News

అక్టోబర్ 15 నుంచి థియేటర్లకు అనుమతి

అక్టోబర్ 15 నుంచి థియేటర్లకు అనుమతి
X

దేశ వ్యాప్తంగా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు ఓపెన్ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. అయితే 50 శాతం పరిమితితోనే థియేటర్లకు అనుమతి ఇచ్చారు. అన్ లాక్ 4 బుధవారంతో ముగియటంతో నూతన మార్గదర్శకాలతో కేంద్ర హోం శాఖ అన్ లాక్ 5కు సంబంధించి కొత్త వెసులుబాట్లతో మార్గదర్శకాలు జారీ చేసింది. అక్టోబర్ 15 తర్వాత స్కూళ్లు ప్రారంభించే అంశంపై కూడా ఆయా రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించనున్నారు. అయితే విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

కేంద్ర హోం శాఖ అనుమతించిన రూట్లలో మినహా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగనుంది. కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ అక్టోబర్ 31 వరకూ ఉంటుంది. క్రీడాకారులకు శిక్షణ ఇఛ్చే స్విమ్మింగ్ పూల్స్ ను మాత్రం అనుమతించనున్నారు. ఇప్పటికే పలు సమావేశాలు, సదస్సులు వంద మందితో నిర్వహించుకకోవటానికి అనుమతించారు. ప్రస్తుతం ఈ సంఖ్యను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. అయితే కంటైన్ మెంట్ జోన్ల వెలుపల మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది.

Next Story
Share it