Telugu Gateway
Latest News

విషాదం.. టీవీ నటి శ్రావణి ఆత్మహత్య

విషాదం.. టీవీ నటి శ్రావణి ఆత్మహత్య
X

ఓ యువకుడి వేధింపులకు పలు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న శ్రావణి ప్రాణాలు తీసుకుంది. శ్రావణి మౌనరాగం, మనసు మమత తదితర సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకాదారణ పొందారు. టిక్ టాక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు శ్రావణి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ హెచ్ 56 బ్లాక్.. సెకండ్‌ ఫ్లోర్‌లో కొండపల్లి శ్రావణి నివాసం ఉంటున్రు. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి (సన్నీ)తో టిక్ టాక్‌లో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు వెల్లడించారరు . అయితే గత కొద్దినెలల నుంచి ఆమెను వేధించటం ప్రారంభించాడని, అతడి వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు చేసుకుందని తెలిపారు.

కుమార్తె ఆత్మహత్యపై ఆమె తల్లి దండ్రులు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరుడు శివ డిమాండ్ చేస్తున్నాడు. తమ కూతురు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ రెడ్డి కారణమణి శ్రావణి తల్లి పాపారత్నం ఆరోపించారు. భాగ్య రేఖ సీరియల్‌లో నటిస్తున్న దేవరాజ్.. తన కూతురు శ్రావణి ద్వారానే సీరియల్స్ లోకి ప్రవేశించాడని చెప్పారు.

Next Story
Share it