Telugu Gateway
Latest News

ఎస్ బిఐ ఉద్యోగులకు షాక్..30 వేల మందికి వీఆర్ఎస్

ఎస్ బిఐ ఉద్యోగులకు షాక్..30 వేల మందికి వీఆర్ఎస్
X

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులకు గుడ్ బై చెప్పనుందా?. అంటే ఔననే వార్తలు వస్తున్నాయి. స్వచ్చంద పదవి విరమణ (వీఆర్ఎస్) ద్వారా ఏకంగా 30100 మందిని సాగనంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఇప్పటికే రంగం సిద్ధం అయిందని..త్వరలోనే అమలు ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు, అధికారులకు దీన్ని వర్తింపచేయనున్నారు. ఖర్చులను తగ్గించుకునే పేరుతో రెండవ విడత స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) అమలు చేయటానికి పథకం రెడీ చేశారు.

డిసెంబర్‌ 1న ప్రారంభమై, ఫిబ్రవరి వరకు మాత్రమే అర్హులైన వారినుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కటాఫ్‌ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్‌ ఆఫీసర్లు, సిబ్బందికి ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. మొత్తం 11,565 మంది అధికారులు,18,625 మంది సిబ్బంది వీఆర్‌ఎస్‌కు అర్హులుగా తేలతారని గుర్తించారు. వారిలో 30 శాతం మంది ముందుకొస్తారని అంచనా. తద్వారా సుమారు 2,170 కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చన్నది బ్యాంక్ లెక్క.

Next Story
Share it