Telugu Gateway
Latest News

అసెంబ్లీ దగ్గర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అసెంబ్లీ దగ్గర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రవీంద్రభారతి దగ్గర ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించటం కలకలం రేపింది. ఆ వ్యక్తి ప్రైవేట్ టీచర్ గా పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటూ పెట్రోల్ పోసుకున్నాడు. అదే సమయంలో జై తెలంగాణ అంటూ నినదించాడు. ఆత్మహత్యా యత్నం చేసిన వ్యక్తి పేరు నాగులు కాగా, తండ్రి పేరు రాములు. కడ్తల్ గ్రామ వాసిగా గుర్తించారు పోలీసులు వెంటనే మంటలు ఆర్పేసి హాస్పిటల్ కు తరలించారు.

Next Story
Share it