ప్రణబ్ కు అంతిమ వీడ్కోలు
BY Telugu Gateway1 Sep 2020 9:11 AM GMT

X
Telugu Gateway1 Sep 2020 9:11 AM GMT
దేశ రాజధాని ఢిల్లీలోని లోథీ శ్మశానవాటికలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు కార్యక్రమం సాగింది. కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. అంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆశ్రునయనల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. కరోనాతో పోరాడి ప్రణబ్ ముఖర్జీ సోమవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
Next Story