Telugu Gateway
Latest News

మాంద్యంలోకి జారుకున్న న్యూజిల్యాండ్

మాంద్యంలోకి జారుకున్న న్యూజిల్యాండ్
X

కరోనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పలు ఆర్ధిక వ్యవస్థలు కోవిడ్ దెబ్బకు నేలచూపులు చూస్తున్నాయి. సాధారణ పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఊహించటానికే చాలా మంది సాహసించటం లేదు. ఇప్పుడు ఆ జాబితాలో న్యూజిల్యాండ్ కూడా చేరింది. రెండవ త్రైమాసికంలో న్యూజిల్యాండ్ జీడీపీ 12 శాతం పతనం కావటంతో ఆ దేశం మాంద్యంలోకి వెళ్లింది. ఇది రికార్డు పతనంగా చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తోనే ఈ పరిస్థితులు తలెత్తాయి.

2010 సంవత్సరం తర్వాత న్యూజిల్యాండ్ మాంద్యంలోకి జారుకోవటం ఇదే మొటిసారి అని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తున్నందున మూడవ త్రైమాసికంలో ఆర్ధిక వ్యవస్థ ఒకింత రికవరి ఉండొచ్చని ఆర్ధిక వేత్తలు అంచనాలు వేస్తున్నారు. దేశంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు..ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం బిలియన్ల కొద్దీ డాలర్లను మార్కెట్ లోకి జొప్పించినా కూడా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ అప్పులు కూడా గణనీయంగా పెరగనున్నాయి.

Next Story
Share it