Telugu Gateway
Latest News

షాకింగ్..పామును ఫేస్ మాస్క్ గా కట్టుకున్న వ్యక్తి!

షాకింగ్..పామును ఫేస్ మాస్క్ గా కట్టుకున్న వ్యక్తి!
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. ఇప్పటి వరకూ మనం బంగారు మాస్క్ లు చూశాం..వజ్రాలతో కూడా చేసిన మాస్క్ లు వచ్చాయి. డబ్బున్న వాళ్ళు కరోనా సమయంలో కూడా ఇలా ఎవరి సరదాలు వారు తీర్చుకున్నారు. అదే సమయంలో వెరైటీ మాస్క్ లతో వార్తలతో నిలిచారు. కానీ ఇప్పుడు ఓ వ్యక్తిని ఏకంగా పామునే మాస్క్ గా చుట్టుకున్నాడు. ఆయనతో కలసి ప్రయాణించిన వారు మందపాటి క్లాత్ తో అలా చుట్టుకున్నాడు అనుకున్నారు అంట ముందు. కానీ తర్వాత విషయం తెలుసుకుని షాక్ కు గురయ్యారు. వైట్ టీ షర్ట్..జీన్స్ వేసుకున్న వ్యక్తి ఇలా మెడకు..మూతిని పూర్తిగా కవర్ చేస్తూ పామును చుట్టుకున్నాడు.

మాంచెస్టర్ కు వెళ్ళే బస్సులో ఓ ప్రయాణికుడు ఇలా దర్శనం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అన్ని దేశాల తరహాలోనే బ్రిటన్ లో కూడా ప్రజా రవాణాలో మాస్క్ ను తప్పనిసరి చేశారు. ఇలా ఓ బస్సులో పామును మాస్క్ గా చుట్టుకున్న వ్యక్తి ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత గ్రేటర్ మాంచెస్టర్ కు చెందిన అధికారులు ఎలాంటి మాస్క్ లు వాడాలో ఆదేశాలు జారీ చేశారు. సర్జికల్ మాస్క్ లు, కండువాలు, వస్త్రాలతో చేసిన ఇతర మాస్క్ లు మాత్రమే వాడాలని పేర్కొన్నారు.

Next Story
Share it