Telugu Gateway
Latest News

వ్యవసాయ బిల్లులు...జగన్..చంద్రబాబు గప్ చుప్!

వ్యవసాయ బిల్లులు...జగన్..చంద్రబాబు గప్ చుప్!
X

వైసీపీ. టీడీపీ. రైతులను పరిరక్షించటంలో తమ అంత ఛాంపియన్లు ఎవరూ లేరు అని చెప్పుకుంటారు ఛాన్స్ దొరికనప్పుడల్లా. ఈ విషయంలో ఎవరికీ ఎవరూ తీసిపోరు. కానీ కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. ఏకంగా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాళీదళ్ కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఏకంగా తన మంత్రి పదవికే రాజీనామా చేశారు. కేంద్రం తాము చెప్పిన మాట వినలేదని..రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న ఈ బిల్లులను తాము సమర్ధించలేమని పార్లమెంట్ వేదికగా ఆ పార్టీ ప్రకటించింది. అంతే కాదు..మంత్రి పదవిని సైతం వదులుకుంది. కాంగ్రెస్ తోపాటు పలు పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కూడా కేంద్రం తెచ్చిన బిల్లులను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తప్ప..రైతుల ప్రయోజనాల కోసం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసి రాజ్యసభలో వీటిని వ్యతిరేకించాలని రాజ్యసభలో పార్టీ నాయకుడు కె. కేశవరావును ఆదేశించారు.

కానీ అత్యంత కీలకమైన ఈ బిల్లుల విషయంలో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడులు ఎక్కడా కూడా నోరు తెరిచి ఈ బిల్లుల వల్ల రైతులకు లాభమా..నష్టమా అన్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేయటం లేదు. మోడీ తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకించటం ఎందుకు అని ఇద్దరు నాయకులు అనుకున్నారో..ఏమో కానీ ఇప్పటివరకూ రెండు పార్టీలు ఈ అంశంపై ఎక్కడా తమ వైఖరి చెప్పిన దాఖలాలు లేవు. రాజ్యసభలో ఓటింగ్ జరిగితే అప్పుడు అయినా వీరి వైఖరి తేలొచ్చు.

Next Story
Share it