Telugu Gateway
Latest News

రవిప్రకాష్ చేతికి టీవీ9 మళ్ళీ చిక్కటం జరిగే పనేనా?!

రవిప్రకాష్ చేతికి టీవీ9 మళ్ళీ చిక్కటం జరిగే పనేనా?!
X

మనం ఏదైనా వస్తువును కొనాలంటే దాన్ని తయారు చేసిన వ్యక్తి అమ్మాలి. తయారీదారు లేదా ఓ సంస్థ ఓనర్ తన సంస్థను, ప్రొడక్ట్ ను అమ్మటానికి ఏ మాత్రం ఆసక్తిచూపని తరుణంలో అసలు ఏ డీల్ అయినా సాధ్యం అవుతుందా?. అతి స్వల్ప వాటా కలిగి ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ప్రస్తుత షేర్ ధర 78.32 రూపాయలకు తాను టీవీ9లో మొత్తం వాటాలను కొంటానంటే జరిగే పనేనా?. ముందు అమ్మకానికి మెజారిటీ వాటాలు ఉన్న వ్యక్తి సిద్ధపడాలి కదా?. ఇదంతా ఒకెత్తు అయితే..రవిప్రకాష్ పిటీషన్ ద్వారా ఆశ్రయించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సీఎల్ టీ) మీకు రవిప్రకాష్ చెప్పినట్లు కంపెనీ నడపటం చేతకావటం లేదు..వాటాలు అన్నీ రవిప్రకాష్ కు అమ్మేయండి అని చెప్పగలదా?. అంటే ఇందులో ఏదీ జరిగే పనికాదని కార్పొరేట్ వ్యవహారాలు తెలిసిన నిపుణులు చెబుతున్నారు. టీవీ9 ప్రస్తుతం లాభాల నుంచి నష్టాల్లోకి జారుకోవచ్చు.. కానీ దాని ప్రమోటర్లు ఆర్ధికంగా అత్యంత శక్తివంతులు అన్న విషయం తెలిసిందే. దీనికి తోడు యాజమాన్య మార్పిడి సమయంలోనే వివాదాలు..కేసులూ నడిచాయి.

కానీ సడన్ గా టీవీ9 ఎపిసోడ్ లో రవిప్రకాష్ ఎంట్రీనే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చాలా కాలంగా రవిప్రకాష్ మౌనంగానే ఉన్నారు. ఎప్పుడు అయితే టీవీ9 నష్టాలు బాట పట్టిందనే సమాచారం తనకు చేరిందో అప్పుడే ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇవ్వటం ద్వారా అటెన్షన్ తనవైపు తిప్పుకునేలా ఈ అంశాన్ని వాడుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత కొన్ని రోజులుగా రవిప్రకాష్ కొత్త ఛానల్ సన్నాహాల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆయన టీవీ9 అంశంపై ఎన్ సీఎల్ టీ లో పిటీషన్ వేయటం ద్వారా తాను రేసులో ఉన్నాననే సంకేతాలు పంపటంతోపాటు.ఈ వివాదం ఇంకా ముగియలేదనే చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కన్పిస్తోంది. అయితే ఆయన చెబుతున్నట్లు టీవీ9 టేకోవర్ కానీ...యాజమాన్య మార్పిడి జరిగే పని కాదని చెబుతున్నారు.

Next Story
Share it