Telugu Gateway
Latest News

ఒక్క రోజులో నాలుగు లక్షల కోట్లు ఔట్

ఒక్క రోజులో నాలుగు లక్షల కోట్లు ఔట్
X

సింగిల్ డే. నాలుగు లక్షల కోట్లు ఔట్. మరో బ్లాక్ మండే. సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. ఈ దెబ్బకు ఏకంగా నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న మార్కెట్ లో సోమవారం నాడు భారీ ఎత్తున అమ్మకాలు సాగాయి. దీంతో సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ మార్కెట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక వ్యవస్థతో స్టాక్ మార్కెట్ డిస్ కనెక్ట్ అయిందని వ్యాఖ్యానించారు.

కరోనాతో జీడీపీ ఎన్నడూలేని రీతిలో పతనం అయి..కార్పొరేట్ రంగం అతలాకుతలం అయిన దశలోనూ మార్కెట్లో ఊహించని స్థాయిలో పెరుగుదల నమోదు అవటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరి సోమవారం నాడు జరిగింది తాత్కాలిక సర్దుబాటా? లేక వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించటం ప్రారంభిందా అన్నది వేచిచూడాల్సిందే. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగానే ఈ సారి పతనం జరిగిందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story
Share it