Telugu Gateway
Latest News

ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా

ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా
X

దేశంలో కరోనాకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) సంచలన విషయాలను బహిర్గతం చేసింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఆధారంగా వీటిపై ఓ అంచనాకు వచ్చారు. ఆగస్టు నాటికి ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా వచ్చిపోయినట్లు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. భారత్‌లో ఆగస్టుకల్లా దాదాపు 20 కోట్ల మందికి కరోనా వచ్చిపోయిందని వెల్లడించింది. దేశంలో 15.9 కోట్ల నుంచి 19.6 కోట్ల మందికి కరోనా సోకిందని, 10ఏళ్ల కంటే పై వయసున్న వారిలో ప్రతి 15మందిలో ఒకరికి కరోనా సోకినట్లు వెల్లడైందని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో 15.6శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చిపోయిందని, నగరంలోని కాలనీల్లో కనీసం 8.2 శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడినట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 4.4శాతం మందికి కరోనా వచ్చిపోయిందని పేర్కొంది. వయసు, ఆడ, మగ తేడా లేకుండా కరోనా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. రాబోయే పండగల సీజన్,, శీతాకాలంలో వైరస్‌ వ్యాప్తికి మరింత అవకాశం పెరుగుతుందని పేర్కొంది.

Next Story
Share it