Telugu Gateway
Latest News

రెండు లక్షల ‘హోండా హైనెస్ బైక్’ వచ్చేసింది

రెండు లక్షల ‘హోండా హైనెస్ బైక్’ వచ్చేసింది
X

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మిడ్ సైజ్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ కు పోటీగా హోండా మోటార్ ఈ హోండా హైనెస్ 350-500 సీసీ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త హైనెస్-సీబీ 350 వాహనాన్ని విడుదల చేశారు. ఈ వాహనంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

హోండా హైనెస్ వాహనం బుకింగ్ ను వెబ్ సైట్ ద్వారా ప్రారంభించారు. రెండు మోడళ్ళలో అంటే డీఎల్ఎక్స్, డీఎల్ఎక్స్ ప్రో మోడళ్లలో ఈ వాహనం అందుబాటులో ఉంది. ఈ హైనెస్ వాహనం ధర ఎక్స్ షో రూమ్ ప్రారంభ ధర 1.90 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. హోండా హైనెస్ సీబీ 350 వాహనాలను కంపెనీ బిగ్ వింగ్ రిటైల్ ఛానల్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఈ బైక్ లో ఎన్నో ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

Next Story
Share it