Telugu Gateway
Latest News

రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు..దుమారం

రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు..దుమారం
X

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ రేప్ కేసులో దారుణం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా పోలీసులు రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించటం దుమారం రేపుతోంది. సామూహిక అత్యాచారానికి గురై తీవ్ర గాయాలతో పది రోజులకుపైగా మృత్యువుతో పోరాడిన యువతి తుది శ్వాస విడిచింది. అయితే ఆమెను ఆస్పత్రి నుంచి నేరుగా హాథ్రస్ కు తరలించి అక్కడే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీసులే అంత్యక్రియలు చేశారు. కుటుంబ సభ్యులకు చెప్పలేదనే వాదనలను పోలీసులు ఖండిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.“భారతదేశపు కుమార్తెపై అత్యాచారం జరుగుతుంది, వాస్తవాలు అణచివేయబడతాయి. చివరికి అంత్యక్రియల హక్కు కూడా ఆమె కుటుంబం నుండి తీసుకున్నారు.

ఇది దుర్వినియోగం, అన్యాయం” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మృతదేహాన్ని భాదితురాలి ఇంటికి తీసుకు వెళ్లనీయకుండా, అంత్యక్రియలకు కుటుంబాన్ని దూరంగా ఉంచి, అర్థరాత్రి హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకంగా అంత్యక్రియలు నిర్వహించడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. స్వయంగా బాధితురాలి కుటుంబ సభ్యులే తమను ఇళ్ళలో బంధించారని చెబుతున్నారు. కనీసం చివర చూపుకు కూడా నోచుకోలేదని బాధితురాలి తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడి హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Next Story
Share it