Telugu Gateway
Latest News

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్..సెప్టెంబర్ 18 నుంచి 20 వరకూ

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్  డేస్..సెప్టెంబర్ 18 నుంచి 20 వరకూ
X

దిగ్గజ ఆన్ లైన్ సంస్థల హంగామా సీజన్ మళ్ళీ స్టార్ట్ అయింది. దసరా పండగకు ముహుర్తం సమీపిస్తుండటంతో సాధ్యమైనంత మేర వ్యాపారం చేసుకునేందుకు ఈ సంస్థలు సన్నాహాలు ప్రారంభించాయి. కోవిడ్ కారణంగా ఆన్ లైన్ వ్యాపారం మరింత జోరందుకున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా కంటే ఈ సారి ఆన్ లైన్ లాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు పలు గణంకాలు చెబుతున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ తో వినియోగదారులకు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది.

సెప్టెంబర్ 10-20 తేదీల్లో ఈ సేల్ హంగామా సాగనుంది. ఈ సేల్ కోసం ఒక రూపాయి చెల్లించి ప్రీ బుక్ ఆఫర్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రీ బుక్ ఆఫర్ సెప్టెంబర్ 15-16 తేదీల్లో మాత్రమే ఉండనుంది. మొబైల్ ఫోన్లతోపాటు ట్యాబ్లెట్లు, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఈ సారి కూడా భారీ డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. ఎస్ బిఐ కార్డు కలిగిన వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు అందించనున్నారు.

Next Story
Share it