Telugu Gateway
Latest News

ఇండిగోకు డీజీసీఏ వార్నింగ్!

ఇండిగోకు డీజీసీఏ వార్నింగ్!
X

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ విమాన ప్రయాణం ఇండిగో ఎయిర్ లైన్స్ కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఆమె ముంబయ్ కు వచ్చిన విమానంలో మీడియా ప్రతినిధులు మైక్ పట్టుకుని నిలుచుని ఉండటంతో పాటు కొంత మంది ఫోటోలు తీయటంతో ఇవి సోషల్ మీడియాలో రావటంతో విమానయాన భద్రతను పర్యవేక్షించే డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగోను వివరణ కోరింది. ఇండిగో కూడా వివరణ ఇచ్చింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ ఎయిర్ లైన్స్ అన్నింటికి ఈ అంశంపై హెచ్చరికలు జారీ చేశారు.

భవిష్యత్ లో ఎప్పుడైనా ఇదే తరహా నిబంధనలు ఉల్లంఘన జరిగితే సంబంధిత రూట్ లో రెండు వారాల పాటు పర్మిషన్ నిలిపివేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్న తర్వాతే తిరిగి అనుమతి మంజూరు చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 లోని రూల్ 13 ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ లో..ఏరో డ్రోమ్ లో ఫోటోలు తీయటానికి అనుమతించరని తెలిపారు.

Next Story
Share it