Telugu Gateway
Latest News

చైనా వైరస్ కు చైనా వ్యాక్సిన్..నవంబర్ లోనే

చైనా వైరస్ కు చైనా వ్యాక్సిన్..నవంబర్ లోనే
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భాషలో చెప్పాలంటే కోవిడ్ 19 అంటే చైనా వైరస్. ఎందుకంటే అది చైనాలోనే పుట్టింది కాబట్టి తాను అలాగే పిలుస్తానని తేల్చిచెప్పాడు. దీనిపై చైనా అభ్యంతరం చెప్పినా..అది చైనా వైరసే అని ప్రకటించాడు. ఇక ఆ సంగతి వదిలేస్తే ఈ వైరస్ పుట్టిన చైనా నుంచే వ్యాక్సిన్ కూడా రాబోతోంది. అది కూడా నవంబర్ లేదా డిసెంబర్ లో ప్రజలకు ఇవ్వటానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనిపై చాలా విమర్శలు ఉన్నాయి. రష్యా వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే అక్కడి ప్రజలకు అందిస్తున్నారు.

భారత్ తోపాటు పలు దేశాల్లో వ్యాక్సిన్ లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే తాజాగా చైనా ఈ వ్యాక్సిన్ గురించి కీలక ప్రకటన చేసింది. తమ వ్యాక్సిన్ నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి ఒకరు తెలిపారు. నాలుగు వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. వీటిలో మూడింటిని ఇప్పటికే అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఇచ్చామని తెలిపారు. వారికి జూలై నెలలోనే ఈ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు. మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సజావుగా సాగుతున్నాయని, ఇవి నవంబర్‌ లేదా డిసెంబర్‌లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Next Story
Share it