Telugu Gateway
Latest News

ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించినా....!

ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించినా....!
X

ఇరవై నాలుగు గంటలు జర్నీలోనే గడిపాడు. ఏకంగా 700 కిలోమీటర్ల మేర ప్రయాణం చేశాడు. దీని కోసం రెండు బస్సులు మారాడు. కానీ చేరుకోవాల్సిన గమ్యాన్ని మాత్రం అడుగు దూరంలో మిస్ అయ్యాడు. కేవలం పది అంటే పదే నిమిషాలు ఆలశ్యం అయింది. ఆదివారం నాడు జరిగిన నేషనల్ ఎలిజిబులిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష రాయలేకపోయాడు. దీంతో ఏడాది వృధా అయిపోయిందని బాధపడుతున్నాడు బీహార్ లోని దర్భంగ్ కు చెందిన సంతోష్ కుమార్ యాదవ్. సంతోష్ కుమార్ యాదవ్ నీట్ ఎగ్జామ్ సెంటర్ తూర్పు కోల్ కతాలో సాల్ట్ లేక్ స్కూల్. కానీ జాప్యం కావటంతో సంతోష్ ను స్కూల్ లోకి అనుమతించలేదు.

అధికారులను పరీక్ష రాసేందుకు అనుమతి కోరినా కూడా ఆలశ్యం అయిందనే కారణంగా నో చెప్పారన్నాడు. వాస్తవానికి పరీక్ష రెండు గంటలకు అయితే తాను సెంటర్ కు 1.40 గంటలకు చేరుకున్నానని..నిబంధనల ప్రకారం 1.30 గంటలకే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించాల్సి ఉందని తెలిపాడు. మార్గమధ్యంలో ట్రాపిక్ జామ్ ల కారణంగానే తాను సకాలంలో పరీక్షకు హాజరుకాలేకపోయినట్లు విద్యార్ధి తెలిపాడు. కోవిడ్ నిబంధనల కారణంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహించారు.

Next Story
Share it