ప్రగతి భవన్ వద్ద కలకలం
BY Telugu Gateway18 Sept 2020 2:32 PM IST

X
Telugu Gateway18 Sept 2020 2:32 PM IST
కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఓ వ్యక్తి రవీంద్రభారతి దగ్గర ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత కాలిన గాయాలతో తుది శ్వాస విడిచాడు. తెలంగాణ వచ్చాక కూడా తమకు ఏమి మేలు జరగలేదని..ఉపాధి అవకాశాలు రాలేదని విమర్శించాడు. అదే సమయంలో జై తెలంగాణ అంటూ నినదించాడు. ఈ ఘటన మరవక ముందే శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద కలకలం రేగింది.
చందర్ అనే ఆటో డ్రైవర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించకోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు లేవు.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదంటూ చందర్ నిరసన తెలిపాడు. తెలంగాణ కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని తెలిపాడు. చందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story



