ఎన్ టివి హెడ్ క్వార్టర్స్ పై అర్ధరాత్రి దాడి
BY Telugu Gateway19 Sep 2020 6:57 AM GMT

X
Telugu Gateway19 Sep 2020 6:57 AM GMT
సంచలనం. ఎన్టీవీ ప్రధాన కార్యాలయంపై శుక్ర్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయానికి సంబంధించిన అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రధాన ద్వారం వద్ద ధ్వంసం చేయటంతోపాటు కార్యాలయం అద్దాలు కూడా పగలగొట్టారు. ఈ దాడి ఎవరు చేశారు..ఎందుకు చేశారు అన్న కారణాలు తెలియాల్సి ఉంది.
అయితే విచిత్రం ఏమిటంటే ఎన్టీవీ యాజమాన్యం మాత్రం తమ కార్యాలయంపై జరిగిన దాడి వార్తను మాత్రం ఎక్కడా ప్రసారం చేసినట్లు కన్పించ లేదు. అయితే ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
Next Story