Telugu Gateway
Latest News

వందే భారత్ మిషన్ తో ఎయిర్ ఇండియాకు 2500 కోట్లు

వందే భారత్ మిషన్ తో ఎయిర్ ఇండియాకు 2500 కోట్లు
X

కరోనా సంక్షోభ సమయంలో పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకు రావటంలో ఎయిర్ ఇండియాదే కీలక పాత్ర. పలు దేశాల నుంచి ప్రత్యేక విమానాల ద్వారా దేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వీసుల ద్వారా ఎయిర్ ఇండియాకు 2550 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఆగస్టు 31 వరకూ ఈ మొత్తం వచ్చిందని తెలిపారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా గ్రూప్ మొత్తం 4505 సర్వీసులు నడిపింది.

దేశంలోకి వచ్చిన 11 లక్షల మంది భారతీయుల్లో నాలుగు లక్షల మంది ఎయిర్ ఇండియా ద్వారానే వచ్చారని తెలిపారు. దీంతోపాటు 1.9 లక్షల మందిని భారత్ నుంచి ఇతర దేశాలకు తీసుకెళ్లిందని..అందులో విదేశీయులతోపాటు బారతీయులు కూడా ఉన్నారని రాజ్యసభకు ఇఛ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Next Story
Share it